![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-7 ఇప్పుడు మరింత క్రేజ్ ని తెచ్చుకుంటుంది. దానికి కారణం ఫ్యామిలీ వీక్. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఆటతీరుతో, మాటతీరుతో ఆకట్టుకుంటుండగా.. బిగ్ బాస్ రోజుకో ట్విస్ట్ ఇస్తూ మరింత హైప్ తీసుకొస్తున్నాడు.
ఫ్యామీలీ వీక్ లో భాగంగా ఈ రోజు మొదటి ప్రోమోలో అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ వచ్చినట్టు బిగ్ బాస్ చూపించారు. అయితే ఇప్పుడు తాజాగా విడుదలైన రెండవ ప్రోమోలో శోభాశెట్టి వాళ్ళ అమ్మ హౌస్ లోకి వచ్చింది. " అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి " సినిమాలోని అమ్మ పాటని బిజిఎమ్ గా వేసి మరింత ఆసక్తిగా మలిచారు బిగ్ బాస్ మేకర్స్. తల్లిని చూసిన శోభాశెట్టి తల్లడిల్లిపోయింది. కొన్ని రోజులుగా ఫ్యామిలీని బాగా మిస్సింగ్ అంటు శోభాశెట్టి అంటుంది.
ఇప్పుడు కన్నతల్లిని చూడగానే శోభాకి కంటనీరు ఆగలేకపోయాయి. అయితే యావర్ కోసం శోభాశెట్టి వాళ్ళ అమ్మ ఒక బహుమతి తీసుకొచ్చింది. యావర్ తల్లి చనిపోయింది. అందుకే నిన్న గౌతమ్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు యావర్ బాగా ఏడ్చేసాడు. ఇప్పుడు కూడా ఎమోషనల్ అయిన యావర్ కి.. కొంగులో దాచిన యావర్ తల్లి ఫోటోని ఇచ్చింది శోభాశెట్టి అమ్మ. ఆ ఫోటోని చూడగానే యావర్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు.
శివాజీ చూసి అమ్మ వచ్చింది యావర్ అనగానే.. మరింత ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత శోభాశెట్టి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడ్డాడు యావర్. నేను కూడా మీ అమ్మనే అంటూ శోభాశెట్టి వాళ్ళ అమ్మ అంది. కాసేపటికి హౌస్ మేట్స్ అంతా యావర్ ని ఓదార్చారు. ఇప్పుడు యావర్ కోసం బిగ్ బాస్ పంపించిన గిఫ్ట్ తో ఈ ఎపిసోడ్ మరింత ఎమోషనల్ గా మారనుంది. అయితే శోభాశెట్టి వాళ్ళ అమ్మ శోభాకి కొన్ని సలహాలిచ్చినట్టు తెలుస్తుంది.
![]() |
![]() |